
మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక బర్త్‌డే విషెస్ తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి తెలుగు సినిమాకు చేసిన సేవలు, అందించిన వినోదం ఎప్పటికీ మరిచిపోలేనిదని పేర్కొన్నారు.
రాజకీయ రంగం నుంచి పలువురు నాయకులు చిరంజీవి సేవాభావం, ప్రజల పట్ల ఆయన చూపిన మమకారం, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. మెగాస్టార్ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ:
“మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక 70వ జన్మదిన శుభాకాంక్షలు. సినీ ప్రయాణం, ప్రజా జీవితం, సేవా కార్యక్రమాల్లో మీ విశిష్టమైన ప్రస్థానం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మీ ఉదారత, అంకితభావం మరెన్నో జీవితాలకు వెలుగునిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షుతో కలకాలం మీరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను.” అని తెలిపారు.
- #చిరంజీవి 70వ జన్మదినం
- #మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే
- #చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్
- #చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు
- #Chiranjeevi Birthday Wishes
- #మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్‌డే విషెస్